Friday, December 27, 2024

బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మురికిలో వేసినట్టే: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మురికిలో వేసినట్టేనని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టామన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, వరికి రూ.500 బోనస్, పంట నష్టపోయిన రైతులకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం లీడర్ లేడని, వాళ్ల కూటమికి టెంట్ లేదని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వచ్చినా, సచ్చినా పోయేదేంలేదని ఆయన చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News