Wednesday, January 22, 2025

ఈ రెండు పార్టీలవి జిమ్మికులు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీనదిలో వేసినట్టేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  హైదరాబాద్ పార్లమెంట్ సీటును తాము గెలుస్తామని జోస్యం చెప్పారు. దేశంలో బలమైన నాయకత్వం బిజెపికే ఉందని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు బిజెపిదేనని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలలో  తెలంగాణలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించి మూడో సారి ముచ్చటగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News