Monday, December 23, 2024

అవినీతి పాలనకు తప్పదు.. పరాభవం: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అవినీతి, నియంతృత్వ పాలనను సాగిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలో బిజెపి కార్యాలయాన్ని ఆయన ప్రారం భించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ’రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీలపై దుష్ప్రచారం చేస్తూ అబద్ధాలు చెబుతూ అధికారాన్ని కాపాడుకుంటుంది.

వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలి. రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇతర సబ్సిడీలకు 1,90,000 కోట్లు ఖర్చు చేస్తూ ఒక్కొక్క రైతుకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తుంది’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈటల రాజేందర్, డికె అరుణ, కొండ విశ్వేశ్వర రెడ్డి, బంగారు శృతి, సత్య కుమార్, బొక్క నరసింహరెడ్డి, సుధాకర్ రావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News