Wednesday, January 22, 2025

కలలో కూడా ఊహించలేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కాదు.. ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పబోం.. సంజాయిషీ ఇవ్వబోం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు కుటుంబ పార్టీలేనని ఆయన విమర్శించారు.

ఆట మొదలైంది.. తెలంగాణ ప్రజలు యుద్ధం చేస్తారు. ఈ యుద్ధానికి ప్రజలకు అండగా బీజేపీ నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే.. ఎవరికి ఓటేసినా వృథానే అని కిషన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్న కిషన్ రెడ్డి తాను 3 సార్లు ఎమ్మెల్యే అవుతానని, కేంద్ర మంత్రి అవుతానని అనుకోలేదన్నారు. ఏం ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News