Thursday, January 23, 2025

దానిపై ప్రగతి భవన్, గన్‌పార్క్‌లో చర్చకు సిద్ధమా?: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రగతి భవన్, గన్‌పార్క్, ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు విసిరారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అసెంబ్లీని వాడుకున్నారని దుయ్యబట్టారు. మజ్లీస్ పార్టీని కల్వకుంట్ల ప్రభుత్వం పొగుడుతుందా? అని అన్నారు. నిన్నటి వరకు కమ్యూనిస్టులను సిఎం కెటిఆర్ తిట్టాడని, ఇప్పుడు వాళ్లను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్ ఎంపిలు పార్లమెంట్ సమావేశాలకు రారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో డబుల్ బెడ్రూం, ధరణి పోర్టుల్‌పై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లపై చర్చ చేయలేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం లాగా అప్పులు చేసి కమీషన్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేయడం లేదని విమర్శలు గుప్పించారు. దేశం ఆర్థిక వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ జిడిపిలో భారత్ ఐదో స్థానంలో ఉందని కిషన్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు రూ.5 లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు. అసెంబ్లీలో సిఎం కెసిఆర్ పరిధి దాటి మాట్లాడారని మండిపడ్డారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అసత్యాలను ప్రచారం చేయడంలో కెసిఆర్ దిట్ట అని విమర్శించారు. అసెంబ్లీ దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిని కెసిఆర్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బిజెపి బలపడుతోందని కెసిఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఆధారాల్లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News