Sunday, September 8, 2024

తెలంగాణను దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూట్‌కేసులు పంపుతున్నారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  శంషాబాద్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బిజెపికి ఓట్లు, సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలు సెల్యూట్ అని సంతోషం వ్యక్తం చేశారు. కెసిఆర్ నియంతృత్వ, నిరంకుళ పాలనపై సుదీర్ఘ పోరాటం చేశామని, సిఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిపై కాషాయ జెండా ఎగిరేశామన్నారు. సిఎం సొంత జిల్లాలో కూడా బిజెపి జెండా ఎగిరిందని ప్రశంసించారు. బిజెపి ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరిగిందని, తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆశీర్వదిస్తున్నారని కిషన్ రెడ్డి కొనియాడారు.

పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్ ఒక్క ఎంపి సీటు గెలవలేక ప్రజా ఆగ్రహానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని, ఇప్పటివరకు ఎందుకు చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై విద్యార్థులు, మహిళలు పోరాటాలు చేయలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని, రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణను దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూట్‌కేసులు పంపుతున్నారని ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్ ఓట్లు బిజెపికి పడ్డాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని, బిఆర్‌ఎస్-బిజెపి ఎప్పటికి ఒక్కటి కాదు అని, కాంగ్రెస్-బిఆర్‌ఎస్ ఒక్కటి అని తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపి లక్ష్మణ్, బిజెపి ఎంఎల్‌ఎలు, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News