Sunday, December 22, 2024

ఇండ్లు కట్టిస్తామన్న కాంగ్రెస్… కూల్చేస్తోంది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేదలకు ఇండ్లు కట్టిస్తామన్న కాంగ్రెస్… ఇండ్లను కూల్చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ నిర్వహకులు రెండు నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు దగ్గర మూసీ పరివాహక ప్రాంత వాసులకు మద్దతుగా బిజెపి ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మూసీ నిర్వాసితులకు బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేదల కష్టపడి కట్టుకున్న ఇండ్లను ప్రభుత్వం కూల్చేస్తోందని, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బాటలోనే సిఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదు అని, పేదల ఇండ్లను కూల్చివేస్తే ఒప్పుకోమని హెచ్చరించారు. మెరుగైన ఇండ్లు కావాలని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News