Friday, December 27, 2024

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో 400ల సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ రోజురోజుకు కనుమరుగవుతోందని తెలిపారు. హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను గాలికి వదిలేశారన్నారు. గ్యారంటీలు అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణకు ఎలా వస్తారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో పదికి పైగా ఎంపి స్థానాలు గెలుస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News