ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు భాగస్వామ్య పక్షాలే మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఢిల్లీలో దిక్కు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌తో ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎంతో సులభంగా ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనుండగా, ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుందని, 18న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 20న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 5 బుధవారం పోలింగ్ నిర్వహిస్తారని వివరించారు. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.