Monday, December 23, 2024

అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలిసారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకై అభ్యర్థులు ఆగమయ్యారని దుయ్యబట్టారు. శనివారం హైకోర్టు మళ్లీ గ్రూప్-1 పరీక్షను రద్దు చేందని, దీనికి సిఎం కెసిఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారిందని, కెసిఆర్ తీరుతో నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అభ్యర్థుల జీవితాలతో సిఎం కెసిఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.

Also Read: శంషీగూడలో రెచ్చిపోయిన కబ్జాదారులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News