Friday, December 20, 2024

గ్రూప్-1 నోటిఫికేషన్.. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ యవతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఫిబ్రవరి 1 గడిచిపోయింది.. గ్రూప్-1 నోటిఫికేషన్ రాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన యువతను కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర హామీలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమవ్వాలని కిషన్ రెడ్డి నేతలకు సూచించారు. మండల, గ్రామ స్థాయి పార్టీ కమిటీలు బలోపేతం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరుపై బూత్ కమిటీలు సమీక్షించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News