Sunday, December 22, 2024

మెజారిటీ స్థానాలు బిజెపికే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో బిజెపి గతంలో కన్నా ఎంతో బలపడింద ని, పా ర్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ని బషీర్‌బాగ్‌లో ఉన్న దేశోద్ధారక భవన్‌లో టియుడబ్లుజె ఆధ్వర్యంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన ‘మీ ట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో బిజెపికి ఇప్పుడు ఉన్న ఆదరణ ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాష్ట్రం లో మెజార్టీ స్థానాలను బిజెపి గెలుచుకుంటుంద ని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014కి ముం దు హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు ఉండేవని, కేంద్రంలో మోడీ ప్ర భుత్వం రాగానే అణచివేశారన్నారు. ఎక్కడ పేలు ళ్లు జరిగినా మూలాలు ఇక్కడే ఉండేవని, ఇప్పు డు ఆ పరిస్థితి లేదన్నారు. భారత్ ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింద న్నారు. మోడీ సారథ్యంలో భారత్ ప్రపంచంలో నే తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నా రు.ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని గుర్తు చేశారు.

దేశంలో ఎన్నో అద్భుతమైన సంస్కరణలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభు త్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ముస్లిం సమాజం మొత్తం ఆమోదించిందని అన్నారు. ప్రజలు బీజేపీని మరోసారి ఆశీర్వదించబోతున్నారని, – రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు తమవేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలు బీజేపీ సాధిస్తుందని జోస్యం పలికారు. కాంగ్రెస్ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మిదిన్నరేళ్లు బీజేపీ పరిపాలించిందని స్పష్టం చేశారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలని ప్రజలంతా 2014లో మోదీకి ఓటేశారని, ఇప్పుడు కూడా మరోసారి ఆశీర్వదించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని వాటిని పరిష్కరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లిందని అన్నారు. తెలంగాణలో రూ.1.02 లక్షల కోట్లతో రహదారులు నిర్మించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో దేశంలో రహదారులు నిర్మిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మత కలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవని అన్నారు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టామని, ప్రస్తుతం పాకిస్థాన్ తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉందని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపు దిద్దుకుంటోందని, రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశామని అన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నామని గుర్తు చేశారు. 13 కోట్ల ఇళ్లల్లో టాయిలెట్లు నిర్మించామని వివరించారు. ప్రజా సంక్షేమమే లక్షంగా బిజెపి పని చేస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News