Tuesday, January 21, 2025

తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వాస్త వ చరిత్రను గత పాలకులు కనుమరుగు చేశారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి శాఖ జి.కిషన్ రెడ్డి విమర్శించారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ చరిత్ర, విమోచన దినోత్సవం ప్రత్యే కత గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. బిఆర్‌ఎస్, కాం గ్రెస్ పార్టీలు రెండూ కూడా రజాకార్ల వారసత్వ పార్టీలలేనని వ్యాఖ్యానించారు. ఎంతోమంది పోరాట యోధులు, సాధారణ ప్రజానీకాన్ని పొట్టనబెట్టుకున్న రజాకర్ల దురాగతాలు, నిజాం ప్రభు వు అరాచకాలకు తెరదించిన రోజే తెలంగాణ విమోచన దినోత్సవమని అన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే కొంచెం ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం అయిన తర్వాత తెలంగాణకు నిజాం నవాబు నుంచి విముక్తి కలి గి నిజమైన స్వాతంత్య్రా న్ని పొందిందని జి.కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మంగళవారం నిర్వహించిన ‘తెలంగాణ వి మోచన దినోత్సవ’ వేడుకల్లో కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తొలుత కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి, భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు అమర జవాన్ల స్తూపానికి నివాళు లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మ ణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కావాల్సి ఉండగా కశ్మీర్ ఎన్నికలు కారణంగా హాజరు కాలేదు. కిషన్ రెడ్డి మాట్లాడు తూ నిజాంపై వేలా ది మంది ప్రజలు వీరోచితం గా పోరాటం చేసి, ప్రజల బలిదానాలు, త్యాగాల తర్వాత తెలంగాణకు స్వా తంత్య్రం వచ్చిందన్నారు. రజకార్ల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ ది సాహసోపేత పాత్ర అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వేలాదిమం ది వీరోచిత పోరాటం ఫలితంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విమోచన లభించిన కిషన్ రెడ్డి అన్నారు. అటువంటి గొప్ప చరిత్రను గత ఉమ్మడి ఏపి లో, ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు రజాకర్ల వారసులైన మజ్లిస్ పార్టీకి తొత్తులుగా మారి కనుమరుగు చేశారని ఆరోపించారు.

బలిదానాలను అవమానించడమే
రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడమంటే పోరాట యోధుల త్యాగాలు, బలిదానాలను అవమానించడమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆక్రుత్యాలను తలుచుకుంటే ఇప్పటికి నా రక్తం మరుగుతుందని, సర్దార్ వల్లభాయి పటేల్ లేకపోతే తెలంగాణకు అంత తొందరగా వి ముక్తి లభించేది కాదన్నది నగ్న సత్యమని అన్నా రు. రాష్ట్రంలోని పాలకులెవరూ ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకపోవడం బాధాకరమని తెలిపా రు. కొన్ని పార్టీలు రజాకార్ల వారసుల మెప్పు పొందేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని, దేశ విచ్చిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు అంటకాగడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.

కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేత
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. తెలంగాణ వి మోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో కిషన్ రెడ్డి జాతీయ పతాకం ఎగురవేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News