Thursday, January 23, 2025

బిజెపి లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ గుండె చప్పుడు వినిపించామని.. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించామని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్లమెంట్ లో సుష్మస్వరాజ్ నేతృత్వంలో 160 మంది బిజెపి ఎంపీలు తెలంగాణ పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఓ సందర్భంలో బిఆర్‌ఎస్ ఎంపి కెకె చెప్పారని ఆయన వెల్లడించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇతర పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బిజెపి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని.. మరికొంత మంది నేతలు పార్టీలో చేరబోతున్నారు. పార్టీ గెలవాలంటే ప్రజల ఆశీస్సులు, నాయకత్వం కూడా అవసరమేనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News