Saturday, December 21, 2024

కామారెడ్డిలో కెసిఆర్ ను గెలిపించడానికి రేవంత్ పోటీ: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూట్‌కేసుల ప్రభుత్వం వస్తుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరమని హెచ్చరించారు. గజ్వేల్, కామారెడ్డిలో సిఎం కెసిఆర్ ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. మోడీని అడ్డుకోవడానికి బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డిలో కెసిఆర్‌ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. తెరవెనుక బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదని కిషన్ రెడ్డి అడిగారు. ఓవైసి కుటుంబం శాసిస్తే కెసిఆర్ ఏదైనా చేస్తారని మండిపడ్డారు. పాతబస్తీకి మెట్రోవసతి ఎందుకు కల్పించలేకపోయారని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News