Monday, January 20, 2025

కెసిఆర్ మాదిరిగానే రేవంత్ ప్రమాదకారి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి ప్రమాదకారి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోసం కెసిఆర్, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని, అబద్దాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారని ధ్వజమెత్తారు. నాంపల్లి జరిగిన బిజెపి సమావేశంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకుందని, అబద్ధాలతో కాంగ్రెస్ 70 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి దిగజారారని, భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదని, భద్రతా బలగాలను కాంగ్రెస్ నాయకులు అవమాన పరిచారన్నారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నందున అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ చెబుతుందని, పాకిస్థాన్ కు అణిగిమణిగి ఉండే అలవాటు కాంగ్రెస్ కు ఉందని కిషన్ రెడ్డి చురకలంటించారు. పాక్ దాడులను భారత్ పూర్తిగా నిలువరించిందని, పాక్ తోకను పూర్తిగా కత్తిరించిడంతో దాని నడ్డివిరిగిందని, కాంగ్రెస్ అసమర్థత వల్ల పాక్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News