Monday, March 17, 2025

ప్రభుత్వ టెండర్లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ప్రభుత్వ టెండర్ల ఖరారులో నాలుగు శాతం రిజర్వేషన్లు మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కర్ణాటక క్యాబినెట్ కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ చట్టానికి సవరణను ఆమోదించింది. ఈ కొత్త సవరణలో ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో నాలుగు శాతం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ విదానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. “కర్ణాటకలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పనులు, హక్కులు రాజ్యాంగ హామీలను కాంగ్రెస్ లాక్కుంటోంది.

ప్రభుత్వ టెండర్లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగాన్ని స్పష్టంగా విస్మరించడమే. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు మత ఆధారిత ఉద్యోగ రిజర్వేషన్ల నుండి ఇప్పుడు ప్రభుత్వ టెండర్లలో రిజర్వేషన్ల వరకు ప్రమాదకరమైన ఉదాహరణను సృష్టిస్తున్నాయి. ఈ మత ఆధారిత రిజర్వేషన్ అన్యాయమే కాదు, రాజ్యాంగ విరుద్ధం. బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానించడమే”నని కిషన్‌రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలో తెలంగాణలో కూడా ఇలానే చేస్తారేమో అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News