- Advertisement -
హైదరాబాద్: అందరూ తమకు సంఖ్యా బలం లేదంటున్నారు కానీ అభివృద్ధి ఆకాంక్షించేవారు బిజెపికి ఓటు వేయబోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మాదేనని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఎవరున్నా మజ్లిస్ కు హైదరాబాద్ రాసివ్వడం రివాజుగా మారిందని విమర్శించారు. ఈసారి కాంగ్రెస్, బిఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయని చెప్పారు. అధికారంలో ఎవరుంటే వాళ్లతో అంటకాగి.. హైదరాబాద్ ను దోచుకోవడం ఎమ్ఐఎమ్ కి పరిపాటి అయిందని మండిపడ్డారు. ఈ సారి ఎమ్ఐఎమ్ కోటలు బద్దలు కొడతామని పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండటం సహజం అని అన్నారు. అలాంటివి ఏవైనా ఉంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది బిజెపినే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -