మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఫిరాయింపులను ప్రో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ మోసపూరిత పార్టీలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు. ఆదివారం ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఇతరపార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ప్రజాస్వామ్యాన్ని మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ ఎలా అపహాస్యం చేశారో, అదే తీరును కాంగ్రెస్ ప్ర భుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అవలంభిస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కెసిఆర్‌కు, రేవంత్‌రెడ్డికి తేడా లేదని కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ప్రభుత్వాన్ని నడిపేందుకు ఇతర పార్టీల నుంచి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ఆయన ధ్వజమెత్తారు. 2029లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్న కిషన్‌రెడ్డి దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు.