Friday, November 15, 2024

తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అభివృద్ధే లక్ష్యంగా నీతి, నిజాయితీతో పనిచేస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. “తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ వచ్చారు. 30ఏళ్ల తర్వాత దేశ ప్రధాని తొలిసారి వరంగల్ కు వచ్చారు. ప్రధాని కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్ల బిఆర్ఎస్ చెప్పింది..ఎందుకు బహిష్కరించారో చెప్పాలి. రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3వేల ఉద్యోగాలు వస్తున్నందున బహిష్కరిస్తున్నారా? లేక రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నందుకు బహిష్కరిస్తున్నారా?.

రాష్ట్రంలో ఎవరినైనా బాయి్ కాట్ చేయాలంటే ముందుగా చేయాల్సింది కల్వకుంట్ల కుటుంబాన్ని. దళితులను మోసం చేసినందుకు దళిత కుటుంబాలు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించబోతోంది. రైతులకు ఉచితంగా ఎరువులిస్తామన్నారు..ఏమైంది?. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారు. పబ్లిక్ సర్వీస్ పేపర్ లీక్ తో లక్షలాది నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారు. హామీలు ఇచ్చిన తప్పిన కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి. బిజెపి, బిఆర్ఎస్ ఒకటే అని దుష్ప్రచారం అచేస్తున్నారు. మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తున్నారు. బిజెపి.. ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీతో కలవదు. కెసిఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసే రోజు ఎంతో దూరంలో లేదు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News