Monday, November 18, 2024

మోడి కేబినెట్‌లో కిషన్ రెడ్డికి చోటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ బిజెపి నేత జి కిష‌న్ రెడ్డికి చోటు లభించింది. మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. బుధ‌వారం రాష్ట్రపతి భవన్ లో కొత్తగా ఎన్నుకున్న మంత్రులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కిష‌న్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది. తొలిసారి కేంద్ర కేబినెట్ మంత్రి హోదా ల‌భించిన తొలి తెలంగాణ బిజెపి నేత కిష‌న్ రెడ్డి కావ‌డంతో బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, కిషన్ రెడ్డి 2004లో హిమాయ‌త్ న‌గ‌ర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2009, 2014లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంబర్‌పేట్ నుంచే పోటీ చేసి ఓడిపోయిన కిష‌న్ రెడ్డి.. 2019లో జరిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌స‌భ‌కు ఎన్నికైయ్యారు.

Kishan Reddy get promotion as Cabinet Minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News