Monday, December 23, 2024

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Don't worry about vaccination says kishan reddy

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బిజెపి కూడా కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం తరపున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలను అమరులకు అంకితం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.. తెలంగాణ సాధనలో బిజెపి కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్‌లో అప్పట్లో రాజ్‌నాథ్ సింగ్, సుష్వాస్వరాజ్ పోరాటం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ కోసం బిజెపి ఎంపిలు కూడా పోరాటం చేశారన్నారు.

Kishan Reddy Greets People on Telangana formation day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News