Sunday, November 17, 2024

కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖ

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐదుగురికి సోమవారం శాఖలను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించింది. సికింద్రాబాద్ ఎంపి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి బొగ్గుల, గనుల శాఖ, బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు.

ఇక ఆంధప్రదేశ్ నుంచి ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తరఫున మోడీ క్యాబినెట్‌లో మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేసిన టిడిపి యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ, గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పదవిని కేటాయించారు. బిజెపి తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కూడా కేంద్ర క్యాబినెట్‌లో స్థానం లభించగా ఆయనకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవిని కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News