జన అశీర్వాద్ సభలో బావోద్వేగానికి లోనైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మళ్లీ అంబర్‌పేట గల్లీలు తిరగాలని మనస్సులో ఉంది
బాధ్యత పెద్దది కావడంతో సమయం సహకరించడం లేదు
హైదరాబాద్: ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన అశీర్వాద్ సభకు విశేష స్పందన రావడంతో శనివారం ఆయన అంబర్‌పేట నియోజకవర్గంలో సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. స్దానిక జనం అధిక సంఖ్యలో రావడంతో ఆయన పాత గుర్తులు నెమరు వేసుకుని ఒకసారిగా బావోద్వేగానికి లోనైయ్యారు. ఈసందర్భంగా ఆయన సభలో ప్రసంగిస్తూ అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందన్నారు. డిల్లీలో ఉన్నానంటే కారణంగా అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలేనని, కేంద్రమంత్రి అయినందుకు సంతోషంగా లేదని, అంబర్‌పేట ప్రజలకు దూరమైనందుకు బాధగా ఉందన్నారు,. అంబర్‌పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తా , ఈప్రాంతమే నాకు జీవం పోసింది. పార్టీ అంబర్‌పేట నాకు రెండు కళ్లతో సమానమన్నారు.
మన తెలుగు రాష్ట్రాల నుంచి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకరావడంలో మీ అంబర్‌పేట బిడ్డ కూడా కీలక పాత్ర పోషించారని, గోల్కొండ కోటను కూడా అభివృద్ది చేసి, అంబర్‌పేట ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానాని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గల్లీ గల్లీ తిరిగినట్లు ఇప్పడు తిరగాలని నాకు మనసులో ఉందన్నారు. కానీ సమయం సహకరించడంలేదు, బాధ్యత పెద్దది, డిల్లీలో ఉండాలి, అందరినీ కలవాలి, అభివృద్ది కార్యక్రమాలు సమీక్షించాలి. నన్ను భవిష్యత్తులోను మీరంతా ఆశ్వీరదించాలని కోరారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని, మాస్కులు ధరిస్తే వైరస్ ముప్పు ఉండదని, కోవిడ్ నిబంధనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు.