- Advertisement -
హైదరాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బిజెపి బైకు ర్యాలీ నిర్వహించింది. బైకు ర్యాలీలో బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ పేరిట రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హత్య చేసిందని ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా రాహుల్ గాంధీ వ్యవహరించారని మండిపడ్డారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నా రాజ్యంగం నిలబడిందంటే అంబేద్కర్ గొప్పదనమేనని కిషన్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ నెట్ వర్క్ పేరుతో 5 ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేలా చేసిన ఘనత ప్రధాని మోదీదే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -