Wednesday, January 22, 2025

సంబంధం లేదని కెసిఆర్ చెప్పగలరా.. ?: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దర్యాప్తును పక్కదారిపట్టించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కెసిఆర్ చెప్పాలి..? ఢిల్లీ మద్యం కేసులో సాక్ష్యాలు ఉన్నాయి.. ఢిల్లీ మద్యం కేసులో మా కుంటుంబానికి సంబంధం లేదని కెసిఆర్ చెప్పగలరా ?.. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ సంబంధం లేదని కెసిఆర్ చెప్పగలరా ?.. అని ప్రశ్నించారు. మద్యం పాలసీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అవకతవకలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News