Wednesday, January 22, 2025

గజ్వేల్‌లో యువమోర్చా నాయకులకు కిషన్‌రెడ్డి పరామర్శ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ తీరు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల గజ్వేల్ లో చెలరేగిన అల్లర్లలో జైలుకెళ్లిన బాధితుల ఇంటికెళ్లి గురువారం ఆయన పరామర్శించారు. యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ యాదవ్, అధికార ప్రతినిధి మఠం మహిపాల్, కాశమైన నవీన్, గణేష్, గంగిశెట్టి రవీందర్‌లతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో శివాజీ విగ్రహాన్ని అవమాన పరచడం సమంజసం కాదని, బిజెపి పార్టీ తరపున ఖండిస్తున్నట్లు వెల్లడించారు. హిందువులను జైలు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News