Wednesday, January 22, 2025

పవన్ కళ్యాణ్‌తో కిషన్ రెడ్డి భేటీ… కారణం మాత్రం అదే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ జి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ బుధవారం జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్‌తో సమావేశమై రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో పోటీ చేయకపోతే, జనసేన పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుందని వివరించారు. బిజెపి అగ్రనేతల అభ్యర్థన మేరకు గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ఉండి బిజెపి అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు కృషి చేసిందని ఆయన అన్నారు.

ఒకటి, రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుతుబుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వరావుపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ తూర్పు, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర, నర్సంపేటతో సహా మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఈ నెల ప్రారంభంలో జనసేన ప్రకటించింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్డీయేలో భాగంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని 119 సీట్లలో కనీసం 32 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News