Sunday, December 22, 2024

చిరంజీవితో కిషన్ రెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం చిరంజీవి నివాసంలో కలిశారు. ఇరువురు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తన నివాసానికి వచ్చిన సందర్భంగా కిషన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి చిరంజీవి సాదర స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. చిరంజీవి గతంలో యూపీఏ ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డి కూడా గత మోడీ ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు.

కాగా, నేడు చిరంజీవితో భేటీపై కిషన్ రెడ్డి తన ఎక్స్ వేదికగా స్పందించారు. చిరంజీవి మంచి మనిషి అని కొనియాడారు. ఆయనను ఎప్పుడు కలిసినా సంతోషంగా ఉంటుందని తెలిపారు. సినీ రంగానికి అందిస్తున్న సేవలు, దాతృత్వ కార్యక్రమాలతో కోట్లాది మందికి చిరంజీవి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. ఇరువురు కలుసుకున్న ఫోటోలను చిరంజీవి, కిషన్‌రెడ్డిలు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News