Tuesday, January 21, 2025

ఇళ్లను కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అంబర్‌పేట: మూసీ ప్రాజె క్ట్ బాధితుల ఇళ్లను కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం అంబర్ పేట నియోజకవర్గంలోని గోల్నాక తులసి రామ్ నగర్ (లంక ) బస్తి, అంబేద్కర్ నగర్ తదితర మూ సీ పరివాహక ప్రాంతంలో సొంతింటిని కో ల్పోతున్న బాధ్యతలను ఆయన పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భ రోసా కల్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుం దరీకరణ పేరుతో పరివాహ క ప్రాంతాలలో పేదల ఇల్లు కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభు త్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రజలకు ప్రభు త్వం ఇచ్చిన భూమి కాదు.. ప్రజలు తమ క ష్టార్జితం ఒకొక్క ఇటుక పేర్చుకొని ఇల్లు క ట్టుకున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇల్లు కావని మం డిపడ్డారు.

గతంలో మాజీ సీఎం కేసీఆర్ మూసీ సుందరి కన్నా పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్‌ను చైర్మన్ చేసి అప్పుడు కూడా ఇదే తరహాలో ఇళ్లకు మార్కింగ్ చేశారని తెలిపారు. గత 10 సంవత్సరాలలో బి ఆర్‌ఎస్ వారు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇ స్తామంటే నాన్చివేత ధోరణితో మభ్య పెట్టారని ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చింది లేదన్నా రు. పేదవాడి సమాధులపై మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన మండిపడ్డారు. కాం గ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు రూ. లక్ష 50 వేల కోట్లు ఖర్చు పెడతామంటుందని, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందులో రూ.50 వేల కోట్లతో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. పేద ల ఇల్లు కూలుస్తామంటే ఊరుకునే ప్రస క్తే లేదని కేంద్ర మంత్రి ఘాటుగా సమాధా నం చెప్పారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్, బిజె పి గోల్నాక డివిజన్ అధ్యక్షుడు మూల రవీందర్ గౌడ్, బిజెపి నాయకులు, పెద్ద ఎత్తున బాధితులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News