Sunday, December 22, 2024

శాసనసభ, మండలి సభ్యులతో కిషన్‌రెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం (ఆగస్టు 3) నుంచి కొనసాగనున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ, మండలి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో సమావేశంలో ఏర్పాటు చేయగా.. శాసనసభ్యులు, మండలి సభ్యుడు హాజరయ్యారు. వారితో చర్చిస్తుండగానే కిషన్‌రెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. బుధవారం ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాల ఎంపిలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇచ్చేందుకు ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ బాటపట్టారు. సమావేశంలో శాసనసభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ ఎవి రెడ్డిలతో సీనియర్ నాయకులు ఇంద్రసేనరెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News