Monday, January 20, 2025

కేంద్ర కేబినెట్‌కు కిషన్‌రెడ్డి డుమ్మా..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్‌రెడ్డి హజరుకాలేదు. బుధవారం నగరంలోని అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు.వరుసగా రెండు సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ నెల 4వ తేదీన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. అప్పటి వరకు వరకు అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్‌ను బిజెపి జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి పదవికి త్వరలో రాజీనామా చేయనున్నారు.

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు మంత్రిగా కొనసాగుతానని వారం రోజుల క్రితం ఆయన ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఆయన దృష్టి సారించారు. ఈ నెల 8న వరంగల్ లో జరిగిన ప్రధాని మోడీ పర్యటన విజయవంతం కావడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. దీంతో పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News