Sunday, January 19, 2025

దేశ కళ్యాణం, దేశ హితం కోసమే బిజెపి మేనిఫెస్టో : కిషన్‌రెడ్డి వెల్లడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వికసిత్ భారత్ పేరుతో బిజెపి సంకల్ప్ పత్రం ఆదివారం విడుదల చేశామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజల ముందు మేనిఫెస్టోను పెట్టామని, దేశ కళ్యాణం, దేశ హితం కోసం తాము మేనిఫెస్టో ప్రవేశ పెట్టామన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులకు సంబంధించిన ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో పెట్టా మని, ముఖ్యంగా ఈ నాలుగు అంశాలపైనా రాబోయే ఐదేళ్లు పని చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం ఇస్తామని సంకల్ప పత్రంలో పెట్టామని, ఆయుష్మాన్ భారత్‌ను పొడగించాం.. ఇది పెద్ద నిర్ణయమన్నారు.

తక్కువ ధరకు మెడిసిన్స్ అందించే స్కీమ్‌ను తీసుకువస్తా మని, గత పదేళ్లుగా నాలుగు కోట్ల ఇళ్లు కట్టాం.. రాబోయే ఐదేళ్లల్లో మూడు కోట్ల ఇల్లు కట్టాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా హైదరా బాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి మ్యానిఫెస్టో ప్రతులను కిషన్ రెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. అంతేకాకుండా.. ‘ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం లాంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలను మరింతగా అభివృద్ధి చేయనున్నాం.. మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా సాధికారత కల్పి స్తాం.. అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.

వాటిని పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.. పోస్ట్ ఆఫీస్‌లను సోషల్ సెక్యూరిటీ కేంద్రాలుగా మారుస్తాం.. రాబోయే రోజుల్లో పోస్ట్ ఆఫీస్లు స్మాల్ బ్యాంక్స్ లాగా చేస్తాం.. బ్లూ రెవల్యూషన్ కింద ప్రపంచ దేశాలకు ఫిష్ ప్రోడకట్స్ ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటాం.. గిగ్ వర్కర్స్, ఆటో, ట్రక్ కార్మికులకు ఇప్పటి వరకు ఎటువంటి చట్టబద్ధమైన విధానాలు లేవు.. గిగ్ వర్కర్లకు వాళ్ల పిల్లలకి ఈ – శ్రామ్ కింద రిజిస్టర్ చేసి వారికి విద్యా వైద్య సహాయం చేస్తాం.. ట్రైబల్ మినిస్ట్రీకి కు నిధులు పెంచుతాం..ట్రైబల్ రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.’ అని కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News