Saturday, January 25, 2025

ఇక్కడి వాళ్లతో అక్కడ ఒప్పందాలా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సీఎం రేవంత్ దావోస్ ప ర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చే శారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మా ట్లాడారు. రాష్ట్రానికి లాభం చేకూరుతుందంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదని, తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఏంటో తనకు ఏం అర్ధం కాలేదన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పె ట్టుబడి రావాలి కానీ కాగితాలకే ఒప్పందాలు పరిమితం కా వొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారని, పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలని, కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారని, వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారన్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది. అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారని, వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేరని కిషన్‌రెడ్డి విమర్శించారు.

బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన కర్పూరి ఠాకూర్ : కార్మికుల కోసం , బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని, బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా సేవలు అందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని, గత ఏడాది అయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న బిరుదు ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన వ్యక్తి అని, సోషలిస్టు పార్టీ నీ కూడా జనతా పార్టీ లో విలీనం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబేతరుల్ని ఎప్పుడు గౌరవించలేదని, భారత రత్నలు వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారని, ఆ కుటుంబం దృష్టిలో రాజకీయాలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబమని కిషన్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు కి భారత రత్న ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ కే దక్కుతుందని, ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టీ ఏ విధంగా ఇక్కడ రాజకీయ మార్పు తీసుకువచ్చారో అలానే కర్పూరి ఠాకూర్ బీహార్ లో తీసుకువచ్చారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా నెహ్రూ తరవాత దేశం లో అత్యధిక కాలం ప్రధాని గా ఉన్నది నరేంద్ర మోడీ అని, తమకు మాత్రమే హక్కు ఉందని ఆ నెహ్రూ కుటుంబం భావన అన్నారు. ఏనాడూ బడుగు బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదని, రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తి. దేశ రాజకీయాల పై అవగాహన లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. అంబేద్కర్ ను మరణించిన తరవాత కూడా వదిలిపెట్టలేదని, అడుగడుగునా ఆయనను అవమానించిందన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం, ప్రజా స్వామ్యం ఉన్నంత కాలం ఈ దేశం లో రాజ్యాంగం రద్దు కాదని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పాఠాలు, రాహుల్ గాంధీ సర్టిఫికెట్ బీజేపీ కి అవసరం లేదని, మీకు ప్రజల సర్టిఫికెట్ అవసరం..దేశ ప్రజలు మోడీ కి సర్టిఫికెట్ ఇచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News