ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారతదేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించిందని ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో, తాము ఉత్పత్తిని పెంచడమే కాకుండా స్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్‌ను కూడా కొసాగించామని శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ విజయం మనం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఆజ్యం పోస్తుందని ఆర్థిక వృద్ధిని పెంచుతుందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును నిర్ధారిస్తుందని కిషన్ రెడ్డి ట్వీట్‌లో ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, ప్రపంచ ఇంధన కేంద్రంగా భారతదేశం ఎదగడానికి తన మార్గంలో పయనిస్తుందని పేర్కొన్నారు. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేరుకున్న క్రమంలో భారత దేశ ఇంధన భద్రతకు బొగ్గు రంగం వెన్నెముకగా పనిచేస్తుందని తెలిపారు. అంకిత భావంతో కూడిన శ్రామికశక్తికి కిషన్ రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్మికులు అవిశ్రాంత ప్రయత్నాలు, నిబద్ధత దీన్ని సాధ్యం చేశాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో తెలిపారు.
గ్లోబల్ ఎనర్జీలో భారత్ లీడర్‌గా ఎదుగుతోంది:మంత్రి కిషన్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -