Sunday, December 29, 2024

మన్మోహన్ మరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం నిరుత్సాహపరిచిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై బీజేపీ ప్రభుత్వం ఆయనను అవమానించిందని, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక శ్మశాన వాటికలో చేయకుండా నిగంబోధ్ ఘాట్ వద్ద జరిపిందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించబడుతుందని, ఇది మాజీ ప్రధానులందరికీ నిబంధనల ప్రకారం జరుగుతుందని

హోంమంత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు, మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులకు తెలియజేసినప్పటికీ, కాంగ్రెస్ తన పొలిటికల్ గేమ్‌ను కొనసాగిస్తోందని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వారి రాజవంశానికి చెందని మాజీ ప్రధాన మంత్రులైన డా. మన్మోహన్ సింగ్, పి.వి. నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలాంటి వారిని నిరంతరం మోసం చేసి, అవమానించిందని చరిత్ర చెబుతోందని విమర్శించారు. అంతేగాక కాంగ్రెస్ ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు, మన్మోహన్ సింగ్ తన సొంత పార్టీ చేతిలో చవిచూసిన అవమానాలను మనం విస్మరించకూడదని, మన్మోహన్ సింగ్ వారసత్వానికి ఈ సంతాపం కంటే ఎక్కువ అర్హత ఉందని కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News