Sunday, January 19, 2025

మూసీ ప్రజల్లో బుల్డోజర్ భయం

- Advertisement -
- Advertisement -

బాధితుల పక్షాన పోరాడే
బాధ్యత బిజెపిదే 
కాంగ్రెస్ రియల్ ఎస్టేట్
వ్యాపారం ప్రక్షాళనతో
సమస్యలేదు..పేదల ఇళ్లు
కూలగొట్టకండి
బిజెపి మూసీ నిద్ర
కార్యక్రమంలో
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సిఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను
స్వీకరిస్తూ బస్తీల్లో బిజెపి
నేతల రాత్రి బస
మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. హైడ్రా కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనగా ఉన్నారన్న ఆయన బాధితులకు భ రో సా కల్పించేందుకే తాము మూసీ నిద్ర చేపట్టామని వెల్లడించారు. హైడ్రా పే రుతో ఎప్పుడు ఏ బుల్డోజర్‌తో ఏ ఇల్లును కూలగొడతారో అనే భయంతో మూసీ పరీవాహక ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేపట్ట వద్దనే వారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని బస్తీల్లో బస చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను బిజెపి స్వీకరించింది. దీంతో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ బస (నిద్ర) కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం బిజెపి నేతలు ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 20 మంది బీజేపీ ముఖ్య నేతలు మూసీనది

పరివాహక ప్రాంతాల్లోని పలు బస్తీల్లో బస చేయడం ప్రారంభించారు. వీరితో పాటు ఆయా ప్రాంతాల్లోని కార్పొరేటర్లు, స్థానిక నాయకులు 8 జిల్లాలకు సంబంధించి బిజెపి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. రాత్రి భోజనం, రాత్రి నిద్ర, మరుసటి రోజు అల్పాహారం ఆయా బస చేసిన ప్రాంతాల్లోనే చేస్తారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలతో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి తామున్నామనే మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం బిజెపి చేస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నేతృత్వం వహించారు. కిషన్‌రెడ్డి అంబర్‌పేట్ నియోజకవర్గంలోని తులసీరాంనగర్ బస్తీలోని అంభోజి శంకరమ్మ నివాసంలో బస చేశారు. ఓల్డ్ మలక్‌పేట్‌లోని శాలివాహననగర్‌లో కె.లక్ష్మణ్, ఎల్బీ నగర్‌లోని ద్వారకాపురంలో మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్, రాజేంద్రనగర్‌లోని హైదర్షాకోటలో చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆఫ్జల్‌గంజ్‌లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేశారు.

ఈ సందర్భంగా అంబర్‌పేట్ నియోజకవర్గంలోని తులసీరాం నగర్‌లో రాత్రి బస్తీవాసులు, మూసీ బాధితులతో కలిసి కిషన్‌రెడ్డి చర్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు బిజెపి తరఫున భరోసా కల్పించేందుకు తాము బస్తీల్లో రాత్రి బస చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మూసీ బాధితులకు న్యాయం జరగాలని తమ పార్టీ నాలుగు నెలలుగా పోరాటం చేస్తోందని స్థానికులకు తెలిపారు. బాధితులతో ఇప్పటికే ధర్నా కూడా నిర్వహించామని కేంద్రమంత్రి గుర్తు చేశారు. ‘మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి’ అనే నినాదంతో మూసీ పరివాహక ప్రాంతంలో బిజెపి మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మూసీ ప్రక్షాళన, – సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి, మూసీ సుందరీకరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన వెంట బీజేపీ Challenges to క్స్ పర్సన్ రాణి రుద్రమ, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News