Friday, November 22, 2024

కేంద్రాన్ని బద్నాం చేస్తే సహించేది లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తుందని జరుగుతోన్న ప్ర చారం అంతా పచ్చి అబద్ధమని, సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మం త్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మ రోసారి తేల్చి చెప్పారు. సింగరేణి సంస్థను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధ్వం సం చేశారని, ఇప్పుడు అదే బిఆర్‌ఎస్ పార్టీ నేతలు సింగరేణిపై విచిత్ర వాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బొగ్గు గనులను సింగరేణికి కేటాయించకుండా బహిరంగ వేలం వేయడంపై అధికా ర కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నేత లు చేస్తున్న విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో కెసిఆర్ తప్పుడు పరిపాలన వల్లే సింగరేణికి అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని కిషన్‌రెడ్డ్డి – మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో జరిగినంత అధికార దుర్వినియోగం మునుపెన్నడూ జరగలేదని అన్నారు. కెసిఆర్ ఏనాడూ కార్మికులను కలిసిన పాపాన పోలేదని విమర్శించారు. 2014కు ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేది కాదని, బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సర్పంచ్ నుంచి మంత్రుల వరకు సింగరేణిని అందినంత దోచుకున్నారని ఆరోపించారు. ఎంఎల్‌ఏలకు సింగరేణి ప్రోటోకాల్ ఉండాలని కెసిఆర్ సింగరేణి యాజమాన్యానికి చెప్పారని ఆయన గుర్తు చేస్తూ ఎంఎల్‌ఏలకు, సింగరేణికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవం తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే సహించేది లేదని మండిపడ్డారు.

సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ఆ సంస్థలో 49 శాతం వాటా ఉన్న కేంద్రంపైనా ఉందని గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుని సొంత కాళ్లపై నిలబడాలని, బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బొగ్గు గనులను వేలం వేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వేలం వేయలేదని, ఆ కారణంగా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయామని వివరించారు. బిఆర్‌ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయజోక్యంతో, సింగరేణి సంస్థ తీవ్రంగా అప్పుల పాలయ్యిందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ఆయన స్ఫష్టం చేశారు. సింగరేణి సంస్ధపై బీఆర్‌ఎస్ పార్టీ మొసలికన్నీరు కారుస్తోందనియన దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను అప్పులపాలు చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.

బిఆర్‌ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా సింగరేణిని దోచుకుని ఆర్థిక విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో 2014 ఏప్రిల్ 1 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లలో రూ.3,500 కోట్లు ఉండేవని కిషన్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు సింగరేణి సంస్థ బ్యాంకులను డామినేట్ చేసేదని, అధిక వడ్డీలు ఎవరిస్తారని బ్యాంకులకు ఆఫర్ ఇచ్చేదని తెలిపారు. 2014కు ముందు ఏ ఒక్కసారి కూడా ఉద్యోగులకు జీతాలు కట్ చేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ.30 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కెసిఆర్ పాలనలో విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. సింగరేణికి, విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు కూడా నిధులు సకాలంలో ఇవ్వలేదని అన్నారు. సబ్సిడీ బిల్లులు చెల్లించకపోవడం కారణంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పారు.

ఆరు శాతం వడ్డీతో చెల్లించాల్సిన బకాయిలను కూడా సింగరేణి చెల్లించలేదని స్పష్టం చేశారు. సింగరేణిని అభివృద్ధి కోణంలో ఏ రోజు కేసీఆర్ చూడలేదని అన్నారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే నిధులలో ఒక్క పైసా కూడా కేంద్రం తీసుకోదని సింగరేణి కార్మికులకు తాను హామీ ఇస్తున్నానని కిషన్‌రెడ్డి అన్నారు. అన్ని రకాలుగా సింగరేణికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సింగరేణిని కేసీఆర్, కేటీఆర్ ఎన్నికలలో ఉపయోగించుకున్నారు తప్ప, కార్మికుల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 రౌండ్ల బొగ్గు గనులను వేలం వేశారని, ఇందులో రూ.37వేల కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో ఒక రూపాయి కూడా కేంద్రానికి రాదని, 14 శాతం రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని వివరించారు. కెసిఆర్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా ఎంఎల్‌ఏలు,మంత్రులు సింగరేణిని ఉపయోగించుకున్నారని తెలిపారు.

ఒక కార్మికుడి తన షిఫ్ట్ మార్చుకోవాలన్నా స్థానిక ఎంఎల్‌ఏ అనుమతి కావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం సింగరేణిపై మొసలి కన్నీరు కారుస్తోందని అన్నారు. సింగరేణిని కెసిఆర్ ఏనాడూ పట్టించుకోలేదని, కేవలం రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకున్నారని దుయ్యబట్టారు. సింగరేణిలో49 శాతం వాటా ఉన్న కేంద్రాన్ని ఏ విషయంలోనూ కెసిఆర్ ఎప్పుడూ సంప్రదించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన రుణమాఫీపై కూడా కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో స్పందించారు. రుణమాఫీ ఎంత మందికి ఇస్తారు, ఎంత వరకు అర్హులనే విషయంలో ఇంకా స్పష్టత లేదని, ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News