Thursday, January 23, 2025

సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం తన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. మంత్రి తన మద్దతుదారులతో కలిసి అడ్డగుట్ట డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కిషన్‌రెడ్డి అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందించారు. అడ్డగుట్ట, తుకారాం గేట్, తార్నాక, లాలాపేట్, మెట్టుగూడ ప్రాంతాలను ఆయన పాదయాత్ర కొనసాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News