దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాలు నిర్వహించుకుంటున్నాం
బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తా: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఎక్కడలేని విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులు బోనాల ఉత్సవాలు జరుపుతున్నారు. ఏడేళ్లుగా ఆలయకమిటీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుపుతోంది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానన్నారు. పంటలను రక్షించాలని, రోగాల నుంచి కాపాడాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుగుతాయన్నారు. గతేడాది నుంచి కరోనా కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం లేకపోయిందన్నారు. సాధారణ పరిస్థితుల్లో భారీ ఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తరఫున కిషన్ రెడ్డి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని ఆయన తెలిపారు.
Participated in the Lal Darwaza Bonalu Celebrations organised by Mahankali Temple, at Telangana Bhavan, New Delhi earlier today.
On this occasion, offered Vastrams to goddess and prayed for strength & grit to all of our countrymen to successfully overcome the pandemic. pic.twitter.com/F3dqiVFMpG
— G Kishan Reddy (@kishanreddybjp) July 14, 2021
Kishan Reddy Perform puja to Mahankali Ammavaru in Delhi