Sunday, December 22, 2024

భూముల వేలం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూముల వేలం రాష్ట్ర ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతో ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలిచ్చే పరిస్థితి లేదు. విభజన సమయంలో తెలంగాణ మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రం. భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం.

సంపద సృష్టించకుండా అమ్ముకోవడం సరికాదు. దేశంలోనే నేనే నెంబర్ 1 అని చెప్పుకునే కెసిఆర్.. భూములు ఎందుకు అమ్ముతున్నారు?. అమ్ముకుంటూ పోతే ప్రజాసదుపాయాల కల్పనకు భూములు దొరకవు. సైన్స్ సిటీ కోసం 20 ఎకరాలు ఇవ్వమంటే.. సిఎం కెసిఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థలం అడిగినా సిఎం ముందుకురాలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News