Sunday, December 22, 2024

తెలంగాణలో భవిష్యత్ అంతా బిజెపిదే: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బిజెపి తన బలాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని.. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడంలేదని చెప్పారు. రాష్ట్రంలో భవిష్యత్ అంతా బిజెపిదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అన్నారు.

ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని.. బీఆర్ఎస్ ను వద్దనుకొని బీజేపీకి ఓటేశారని చెప్పారు. తెలంగాణలో 8సీట్లు గెలిచుకున్నామని… ఏడు సీట్లలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. చాలా చోట్లు బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ లో కూడా బీజేపీ గెలిచిందని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందన్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News