Sunday, December 22, 2024

బిసిని సీఎం చేస్తానంటే అవహేళన చేస్తున్నరు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిజెపి బిసిని ముఖ్యమంత్రి చేస్తానంటే బిఆర్ఎస్ అవహేళన చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. మోడీ ప్రచారంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

బిసిని సీఎం చేస్తానంటే బిఆర్ఎస్ అవహేళన చేస్తుందని.. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర హామీ ఏమైందని.. బిసిని సిఎం చేసే దమ్ము కాంగ్రెస్, బిఆర్ఎస్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్.. తెలంగాణను సర్వనాశనం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇవ్వరని కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News