హైదరాబాద్ : కర్ణాటకలో తాము చేసిన తప్పులే బిజెపి ఓటమికి కారణమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం కర్ణాటక శాసనసభ ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కర్ణాటకలో తాము చేసిన తప్పులే బిజెపిని ముంచాయన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పొరపాట్లు కారణంగానే తాము ఓడిపోయామని చెప్పారు. కర్ణాటకలో బిజెపి ఒక తప్పు చేస్తే.. తెలంగాణలో బిఆర్‌ఎస్ వంద తప్పులు చేసిందన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు. కర్ణాటక ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. తప్పులను సరిచేసుకుని లోకసభ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయామన్నారు. తొందరలోనే తమకు ఉన్న లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు బాగా ధైర్యం వస్తుందన్న ప్రచారం ఒట్టిదే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.