హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాసిన లేఖపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎంపిల సమావేశంపై లేఖ పంపినందుకు భట్టికి ధన్యవాదాలు తెలిపారు. ఎంపిల మీటింగ్ కు బిజెపి నుంచి హాజరుకాలేకపోతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ ఆలస్యంగా అందడంతో పార్టీలో చర్చించుకునే సమయం లేదన్నారు. ఇప్పటికే తమకు ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఖరారయ్యాయని వివరించారు. భవిష్యత్ లో సమావేశం నిర్వహించాలనుకుంటే కాస్త ముందుగా తెలియజేయగలరని కోరారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాసేపట్లో ప్రజాభవన్ లో ఆల్ పార్టీ ఎంపిల సమావేశం జరగనుంది. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. పార్లమెంట్ లో తెలంగాణ ఎంపిలంతా గళమెత్తాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగనుంది. ముఖ్య అతిథిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే బిజెపి ఎంపిలకు ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.జ