Monday, December 23, 2024

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. రాజగోపాల్ రెడ్డి అనుకున్నట్టు బిఆర్‌ఎస్‌కు బిజెపి పోటీ కాకుండా పోదన్నారు. ఎవరి ఇష్టం వారిదని కిషన్ రెడ్డి మీడియాకు తెలిపారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేసి అనంతరం కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీలో ఉండడంతోనే ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News