- Advertisement -
బిఆర్ఎస్ ఎమ్మెల్సే కవిత ఇంట్లో ఈడీ సోదాలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పడు కవితకు భయమెందుకు? అన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. ఇన్నాళ్ళూ కవిత విచారణకు సహకరించలేదన్న ఆయన కవిత సహకరించనందుకే ఈడీనే ఆమె ఇంటికి వెళ్లిందన్నారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -