Monday, December 23, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని సింగరేణి ఆధికారులను ఆఘమేఘాల మీద అక్కడికి పంపించి రాజకీయ డ్రామకు తెర తీశారన్నారు. బిఆర్‌ఎస్ మంత్రులు తప్పుడు ప్రకటనలు చేశాసారని విమర్శించారు. అవకాశం లేదని కేంద్రం చెప్పినా రాజకీయ లబ్ధికోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సాధ్యం కాదని తెలిసినా.. బయ్యారం స్టీల్ ఫ్లాంట్ ను రాష్ట్రమే ఏర్పాటు చేస్తోందన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మూతపడిన అనేక పరిశ్రమలను వంద రోజుల్లో తెరిపిస్తామన్న కెసిఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ సమాజం ప్రశ్నించాలని కిషన్ రెడ్డి అన్నారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అన్నారని, తొమ్మిదేళ్లు అవుతున్నా ఎందుకు ప్రారంభించలేదని ఆయన నిలదీశారు. తొమ్మిదేళ్ల తరువాత అంబేద్కర్ జయంతి రోజున సిఎం బయటకు వచ్చారని.. ఇది రాజకీయ ఎత్తుగడే తప్ప అంబేడ్కర్‌పై ప్రేమ లేదని విమర్శించారు. ఇఫ్తార్ వెళ్లేందుకు ఉన్న సమయం.. భద్రాచలం వెళ్లేందుకు సమయం ఉండదని అన్నారు. అవినీతి పై ఆరోపణలు వస్తే దర్యాప్తు జరపొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం సహకరించక పోవడంతో ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ తెలంగాణ సమాజం దృష్టికి తెస్తున్నామని వెల్లడించారు.

సిబిఐపై అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. వ్యక్తులు ఎవరైనా సరే చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అతీక్ అహ్మద్ హత్యపై స్పందిస్తూ పాతబస్తీలో ఆస్తులు అమ్ముకొని ప్రజలు కట్టు బట్టలతో వెళ్తున్నారని దానికి కారణం ఎవరో అలాంటి వాటిపై ఒవైసీ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. అతీక్ హత్య జరిగిన వెంటనే కమిటీని వేశామని, వందల కేసులు ఉన్న వ్యక్తి చనిపోయాడని.. అలా జరగాల్సింది కాదన్నారు. సమావేశంలో రాష్ట్ర బిజెపి నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News