Wednesday, November 13, 2024

తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ కానుకలు ఇవ్వబోతున్నారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకలు ఇవ్వబోతున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. నగరంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో శనివారం కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణాయాదవ్ బిజెపిలో చేరారు. ఇద్దరికి కాషాయం కండువా కప్పి కిషన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డికె అరుణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “రేపు(ఆదివారం) ప్రధాని మోడీ పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారు. లంగాణ ప్రజలకు కానుకలు ఇవ్వబోతున్నారు. మోడీ సభతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభం. బిఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏ మాత్రం పట్టదు. కెసిఆర్‌ పథకాలన్నీ పూర్తిగా వైఫల్యం చెందాయి. విద్య, వైద్యం పూర్తిగా కుంటు పడింది. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యింది.. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌ తెలివి ఎక్కడ బోయింది. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్టే.ఎలాగో గెలవరు కాబట్టి ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్‌ ఇస్తుంది. ఆరు గ్యారెంటీలు కాదు.. 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే బిజెపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News