Tuesday, January 21, 2025

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం బిజెపియేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పే ర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ పాలన లో అవినీతి, కుటుంబ పాలనను చూసి విసిగిపోయిన ప్రజలకు ప్ర స్తుత కాంగ్రెస్ పాలనలోనూ ఏ ఒ క్క హామీ అమలు చేయకపోవడంతో నాలుగు నెలల్లోనే ప్రజలకు ప్రభుత్వ పనితీరు అర్ధమైందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నమ్మకపోవడం వల్ల చాలామంది కాంగ్రెస్ వారు కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారన్నారు. మజ్లిస్ పార్టీ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించిందన్నారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని కిషన్‌రెడ్డి జోస్యం పలికారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించట్లేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్, ఢిల్లీలో కిషన్‌రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన మోసపూరిత హామీలపై తాము అడుగడుగునా నిలదీస్తామని అన్నారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ ప్రజలకు అందడం లేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించడం లేదని, పెళ్లి చేసుకుంటే అమ్మాయికి తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని, ఎవరికి ఇచ్చారని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కిషన్ రెడ్డి స్పందించేందుకు తొలుత నిరాకరించారు. అయితే ఏపీలో ఎన్డీయే అలయెన్స్ ఉన్నందున తాను తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఒక్క విషయం మాత్రం చెప్పగలనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా ఎన్డీయే గెలుస్తుందన్నారు. ఎవరికి ఎన్ని సీట్లు అనే దానికన్నా కచ్చితంగా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు ఎన్డీయే గెలుచుకుంటుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో రెండంకెల స్థానాలు బిజెపి సొంతం చేసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బిజెపికి అనుకూలంగా ఓట్లు తొలగించినట్లు తన దృష్టికి వచ్చిందన్న ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సంస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ జాబితాలను సంస్కరించాలని తాము గతంలో పలుమార్లు జిల్లా ఎన్నికల అధికారులకు తెలియజేశామని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికలకు రెండు రోజుల ముందు ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఓట్లను అధికారులు తొలగించారని ఆరోపించారు. బిజెపికి అనుకూలమైన ఓట్లే తొలిగించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారని, కొంత మందికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి హితవు పలికారు. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని ఎన్నికల ప్రచారంలో తిరిగారని, అయితే ప్రజలు మాత్రం ఆ ప్రచారాన్ని నమ్మలేదన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు బదులు గాడిద గుడ్డు అయిందేమోనని ప్రజలు భావించారని ఆయన ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికలు రెఫరెండమని రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారని, అయితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ఏం చేస్తారో చెప్పాలని కిషన్‌రెడ్డి నిలదీశారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉన్నందున గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయా? లేవా? అనేది ప్రజలకు స్పష్టం చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మినహాయించి, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని గొడవలు జరగ్గా. రాయలసీమలో ప్రశాంతంగానే జరిగాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News